ఈషా ఫస్ట్ డే కలెక్షన్స్! టోటల్ రన్ లో ఎంత రాబడుతుంది
on Dec 26, 2025

-పర్వాలేదనే స్థాయిలో కలెక్షన్స్
-సినిమా బాగుందని టాక్
-హార్రర్ మెప్పిస్తుంది.
హర్రర్ థ్రిల్లర్ చిత్రాల రాక ఈ మధ్య కాలంలో తక్కువగా అయ్యింది. ఆ లోటుని భర్తీ చేస్తూ 'ఈషా'(Eesha)అనే మూవీ నిన్నసిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. పైగా లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి హిట్ చిత్రాలని రిలీజ్ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈషా ని రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పైగా సినిమాకి నమ్మకంతో మేకర్స్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ని ప్రదర్శించారు. మరి ఈ మూవీ తొలి రోజు సాధించిన కలెక్షన్స్ ఇవే అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఆ కలెక్షన్స్ ఏంటో చూద్దాం.
ఈషా తొలి రోజు 1 .65 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. చిత్ర యూనిట్ మాత్రం కలెక్షన్స్ వివరాలని ఇంకా అధికారకంగా వెల్లడి చెయ్యలేదు.బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఈషా కి పాజిటివ్ టాక్ నడుస్తుంది.దీంతో ఈ చిత్రం వీకెండ్ తో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టే పూర్తి స్థాయి కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
Also read: ఈషా మూవీ రివ్యూ
నయన, కళ్యాణ్ ,అపర్ణ, వినయ్ అనే నలుగురు మిత్రులు మనుషుల ఆత్మలు ఉండవనే బలమైన నమ్మకానికి కలిగి ఉంటారు.కానీ ఈ నలుగురే చనిపోయి ఆత్మలుగా తమకి తాము పరిచయమవుతారు. ఈ సందర్భంగా నడిచే కథనాలు ఎంతో ఉత్కంఠతని కలిగిస్తాయి. హెబ్బా పటేల్, ఆదిత్ అరుణ్, సిరి హనుమంత్, వినయ్ లు ఆ నలుగురు ఫ్రెండ్స్ గా చెయ్యగా, వాళ్ళకి ఆత్మలు గురించి చెప్పే స్వామిజిగా బబ్లూ పృథ్వీ కనిపించి తన నటనతో మెస్మరైజ్ చేసాడు. మైన్ మధు కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లో ఒక రేంజ్ పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించాడు. శ్రీనివాస్ మన్నే(Srinivas Manne)దర్శకత్వంలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించడం జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



