'ఈగల్' పబ్లిక్ టాక్.. రవితేజ హిట్ కొట్టాడా?...
on Feb 8, 2024
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్'. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది రవితేజ నటించిన 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు నిరాశపరిచినప్పటికీ.. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'ఈగల్'పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను ఈ సినిమా నిలబెట్టుకుందనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే కొన్ని చోట్ల 'ఈగల్' మొదటి షోలు పూర్తయ్యాయి. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. స్టోరీ లైన్ బాగుందట. ఫస్టాఫ్ జస్ట్ ఓకే అనిపించగా, సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందట. ఇంటర్వెల్, పతాక సన్నివేశాలు సహా యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయట. యాక్షన్ ఫిల్మ్ లవర్స్ కి ఈ సినిమా పండగే అని చెబుతున్నారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉందట. ఇక సహదేవ్ గా రవితేజ నట విశ్వరూపం చూపించాడని.. నవదీప్, అనుపమ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయని అంటున్నారు. మొత్తానికి మొదటి షోలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రవితేజ హిట్ కొట్టేలాగే ఉన్నాడు.
Also Read