12 రోజుల వ్యవధిలో రానా డబుల్ ధమాకా!
on Dec 10, 2021

`బాహుబలి` సిరీస్ తో జాతీయ స్థాయిలో నటుడిగా మంచి గుర్తింపు పొందారు దగ్గుబాటి స్టార్ రానా. కేవలం కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా అభినయానికి ఆస్కారముండే వేషాల్లోనూ కనిపిస్తూ అన్ని వర్గాల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు ఈ టాలెంటెడ్ యాక్టర్.
అందులో అజయ్ దేవ్‌గణ్ చేసిన ఎంట్రీ సీన్ లాంటిది మరే మూవీలోనూ నేను చూడలేదు!
ఇదిలా ఉంటే.. దగ్గుబాటి రానా నటించిన రెండు సినిమాలు కేవలం 12 రోజుల వ్యవధిలో థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. రానా చాన్నాళ్ళ క్రితమే నటించగా విడుదలకు నోచుకోని `1945` అనే పిరియడ్ డ్రామా.. ఎట్టకేలకు డిసెంబర్ 31న సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది. అలాగే మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందిన `భీమ్లా నాయక్` సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో డేనియల్ శేఖర్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు రానా దగ్గుబాటి. మరి.. తక్కువ గ్యాప్ లో రానున్న ఈ రెండు సినిమాలతో రానా నటుడిగా ఎలాంటి గుర్తింపుని పొందుతారో చూడాలి.
కాగా, మరోవైపు సాయిపల్లవితో కలిసి రానా నటించిన `విరాట పర్వం` కూడా విడుదలకు సిద్ధమైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



