హరీశ్ మాటలు డీజేకు చేటు చేస్తాయా..?
on Jun 5, 2017

హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ చేస్తున్నాడు. రీసెంట్‌గా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన "అస్మైక భోగ "సాంగ్‌కు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం ఈ అంశంపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ప్రమాదాన్ని గుర్తించిన చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ దీనికి త్వరగా ముగింపు పలకాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా స్టోరీ లైన్‌ను చెప్పేశాడు.
ఒక బ్రాహ్మణుడికి కోపం వస్తే..శాపంతో కానీ..బాణంతో కానీ గెలుపు సాధిస్తాడు. దీనినే బేస్‌గా తీసుకుని తాను స్టోరీని రూపొందించానని చెప్పాడు. అయితే దిల్‌రాజు లాంటి పెద్ద నిర్మాత..అల్లు అర్జున్ లాంటి స్టార్, హరీశ్ శంకర్ లాంటి దర్శకుడు ఇంతటి క్రేజీ కాంభినేషన్‌లో సినిమా అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా ఎలా ఉండబోతుంది..కథ ఎలా ఉంటుందా అన్న ఎంగ్జయిటీతో అభిమానులు సినిమా చూడాలనుకుంటారు. అలాంటిది స్టోరీలైన్ ఎంటో ముందుగా తెలిస్తే అందులో కిక్కేముంటుంది. ఇది ఫైనల్‌గా సినిమా రిజల్ట్‌పై ప్రభావం చూపిస్తుంది. ఈ వివాదాలన్నింటి మధ్యే ఇవాళ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. మరి చూద్దాం ట్రైలర్‌లో ఇంకేముందో..?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



