డీజే - రికార్డులన్నీ ఫేక్ అట!
on Jun 28, 2017
'నాన్ బాహుబలి రికార్డులన్నీ మావే..' అంటోంది డీజే టీమ్! నాలుగు రోజుల్లో పాత రికార్డులకు పాతరేశాం అని ఘనంగా చెప్పుకొంటున్నారు. అయితే ఈ రికార్డుల్లో నిజమెంత? అని ప్రశ్నిస్తున్నాయి ట్రేడ్ వర్గాల నిపుణులు. డీజే రికార్డులన్నీ సొంత కవిత్వాలేనని, డీజేకి అంత సీన్లేదని పరాచకాలు ఆడుతున్నారు. డీజే - డివైడ్ టాక్ మధ్య విడుదలైనందన్నది పచ్చినిజం. ఈ సినిమా ఫ్యాన్స్‌కే నచ్చలేదు. `హరీష్ శంకర్ ఇలా చేస్తాడునకోలేదు` అంటూ బన్నీ ఫ్యాన్సే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు ఘనమైన ప్రారంభమే లభించినా... రెండోరోజు, మూడో రోజు వసూళ్ల హవా బాగా తగ్గింది. రంజాన్ పుణ్యమా అని సోమవారం కాస్త ఊపందుకొన్నాయి. ఎంత కాదన్నా.. ఈ సినిమా రూ.40 కోట్లకు దరిదాపుల్లో వసూళ్లు తెచ్చుకొంది. అయితే... డీజేకి ఈ 40 సరిపోవు. బయ్యర్లు కాస్త దారిలో పడాలంటే.. మరో రూ.40 కోట్లయినా రావాలి. ఈ శుక్రవారం పెద్ద సినిమాల హడావుడి లేదు కాబట్టి, వచ్చేవన్న చిన్న సినిమాలే కాబట్టి డీజే కాస్త ఆశలు పెట్టుకోవొచ్చు. కానీ మరీ.. 40 కోట్లు తెచ్చుకొంటుందనుకోవడం అత్యాసే. కీలకమైన నైజాం, కృష్ణా జిల్లాలు దిల్ రాజు చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడ దిల్ రాజు అండ్ కో ఎంత చెబితే.. అంత వసూళ్లు వచ్చినట్టు భావించాలి. మరీ ముఖ్యంగా నైజాంలో వసూళ్లు బాగా మందగించాయని, డీజే టీమ్ చెప్పినంత ప్రభంజనం ఇక్కడ కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్లో కూడా అంతే! దీన్ని బట్టి డీజే రికార్డులపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయినా... ఈ రోజుల్లో ఈ రికార్డుల లెక్కల్ని ఎవడు నమ్మాడు కనుక. చేతిలో ఏరియాలు పెట్టుకొన్నన్ని రోజులు.. నోటి నుంచి అంకెలు ఇలా ధారాళంగా వస్తూనే ఉంటాయి.