మూడోసారి తండ్రయిన పాపులర్ డైరెక్టర్
on Jan 8, 2021

స్టార్ హీరో ధనుష్ అన్నయ్య, పాపులర్ తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్ మూడోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య గీతాంజలి గురువారం పండంటి బాబుకు జన్మనిచ్చారు. బుడతడికి రిషికేశ్ అనే పేరు కూడా పెట్టేశారు. బాబు పుట్టిన విషయాన్ని ఆ దంపతులు ఓ నోట్ ద్వారా వెల్లడించి, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 2021 జనవరి 7న రిషికేశ్ సెల్వరాఘవన్‌ను ఆనందం నిండిన హృదయాలతో ఆహ్వానిస్తున్నామని అందులో పేర్కొన్నారు.
‘‘మేం ఐదుగురం అయ్యాం. రిషికేశ్ గురువారం ఉదయమే ఈ ప్రపంచంలోకి వచ్చాడు. సంతోషం తెచ్చాడు. మా కుటుంబానికి ప్రేమతో శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడు’’ అని సెల్వరాఘవన్ దంపతులు తెలిపారు. 2011లో పెళ్లాడిన ఆ దంపతులకు 2012 జనవరిలో లీలావతి అనే పాప, 2013 అక్టోబర్‌లో ఓంకార్ అనే బాబు పుట్టారు. ప్రస్తుతం తమ్ముడు ధనుష్‌తో అయిరత్తిల్ ఒరువన్ 2 చేసే పనిలో ఉన్నాడు సెల్వ. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



