కల్కి 2.. షాకింగ్ అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్!
on Mar 18, 2025
గతేడాది 'కల్కి 2898 AD' బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్ (Prabhas). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉందని అనౌన్స్ చేశారు. అయితే 'కల్కి-2' ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై సస్పెన్స్ నెలకొని ఉంది. (Kalki 2)
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. 'ది రాజా సాబ్', 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత కల్కి-2 తో పాటు స్పిరిట్, సలార్-2, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇన్ని సినిమాల నడుమ.. కల్కి-2 వంటి భారీ సినిమాకి ప్రభాస్ తగినంత సమయం కేటాయించగలడా? అసలు ఈ సినిమా ఎప్పుడు నుంచి మొదలవుతుంది? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. (Nag Ashwin)
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'ఎవడే సుబ్రమణ్యం' మార్చి 21న రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఆయనకు కల్కి-2 కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. "ప్రస్తుతం కల్కి-2 ప్రిపరేషన్ నడుస్తోంది. ఈ ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశముంది. కల్కి-2 లో ప్రభాస్ గారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. మొదటి పార్ట్ లో మహాభారతం మరియు ఇతర కీలక పాత్రల సెటప్ చేశాం. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ పోషిస్తున్న భైరవ, కర్ణ పాత్రల గురించే ఎక్కువ ఉంటుంది." అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
