తన లిమిట్స్ దాటుతున్న మారుతి..!
on May 13, 2016
డైరెక్టర్ మారుతి చాలా సింపుల్ గా సినిమాలు తీసేస్తాడు. అతి తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి, మంచి రిచ్ ఫీల్ కల్పించడంలో ఎక్స్ పర్ట్. భలే భలే మగాడివోయ్, ప్రేమకథాచిత్రమ్ లాంటి సినిమాల్ని పది కోట్ల లోపే ముగించేసి, మూడింతల లాభాన్ని జేబులో వేసుకున్నాడు. అందుకే మారుతితో సినిమా అంటే, ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా షూటింగ్ జరిగిపోతుంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో బాబు బంగారం అనే సినిమా చేస్తున్నాడు మారుతి. అతను డైరెక్ట్ చేస్తున్న మొదటి స్టార్ హీరో వెంకీయే. సినిమా రిచ్ నెస్ కోసం బడ్జెట్ ను తన లిమిట్ 10 కోట్లను దాటించేశాడట. అంతేకాక, ఇప్పటి వరకూ పాటల కోసం ఫారిన్ వెళ్లని మారుతి, సినిమాలో పాటల్ని విదేశాల్లో చిత్రీకరించాలని డిసైడ్ అయ్యాడట. సినిమాలో వెంకీ నయన్ ల మధ్య వచ్చే రెండు డ్యూయెట్లను స్పెయిన్ లోని కళ్లు చెదిరే లొకేషన్స్ లో చిత్రీకరించబోతున్నారట. ఇప్పటికే పాటలు తప్ప సినిమా అంతా పూర్తి చేసేసిన మారుతి నెలాఖరుకు మొత్తం సినిమాను చుట్టేయాలని చూస్తున్నాడు. అన్నీ కుదిరితే జూన్ నెలాఖరుకల్లా బాబు బంగారం ధియేటర్లలో హడావిడి చేస్తాడని సమాచారం.