రెండో మూవీ ఎల్లమ్మ మీద కొంచెం ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నాం
on Dec 28, 2024
‘బలగం’ మూవీని ఇష్టపడని వాళ్లంటూ ఎవరూ లేరు. ఐతే ఇప్పుడు ఆడియన్స్ అంతా వేణు అప్‌కమింగ్ మూవీ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బలగం మూవీ విడుదలయ్యి ఏడాది దాటిపోయింది. ఎన్నో గ్రామాల్లో ప్రజలు ‘బలగం’ మూవీని చూసి ఆదరించారు. దిల్ రాజు నిర్మాణం వల్ల ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు తన సెకండ్ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. " నాకు మట్టి కథలంటేనే ఇష్టం. బలగం తర్వాత మంచి మూవీ చేయాలని అనుకుంటున్నా. ఆడియన్స్ కి మంచి మూవీ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. జబర్దస్త్ లో నాకు మంచి లైఫ్ ఉంది. అంత బిజీగా ఉండేవాడిని. అప్పట్లో జబర్దస్త్ లో ఫస్ట్ టీమ్ మాదే. మాకు అప్పట్లో అద్భుతమైన రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు. కూరగాయలు వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించా.
ఇక్కడ హైదరాబాద్ లో షూటింగ్స్ లేనప్పుడు డబ్బులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఊళ్లోకి వెళ్లి ఒక పది రోజులు వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుని వచ్చేవాడిని. వాటినే ఖర్చుపెట్టుకునేవాడిని. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ కూడా చేసాను. షావలిన్ కుంఫులో బ్రౌన్ బెల్ట్ హోల్డర్ ని కూడా. 1996 లో సుమన్ గారి చేతుల మీద ఛాంపియన్ షిప్ ని కూడా అందుకున్నా. హనుమంతుడి భక్తుడిని నేను. ‘బలగం’ తరువాతి సినిమాకు ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ అని అనుకుంటున్నాం. బలగం సినిమా హిట్ మాత్రమే కాకుండా చాలామంది దగ్గర నుండి ప్రేమ, గౌరవం ఇచ్చింది అందుకు నేను అదృష్టవం చేసుకున్న. సెకండ్ మూవీ విషయాన్ని త్వరలో అనౌన్స్ చేస్తాను. ప్రేక్షకులు అందరికీ ఇది నచ్చుతుంది. ఇందులో కల్చర్ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది." అని చెప్పుకొచ్చాడు వేణు.
Also Read