Home

»

Latest News

డింపుల్ హ‌యాతి.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్!

Jan 31, 2022 12:07PM

`గ‌ల్ఫ్` (2017) చిత్రంతో టాలీవుడ్ లో క‌థానాయిక‌గా తొలి అడుగేసిన తెలుగ‌మ్మాయి డింపుల్ హ‌యాతి.. ఆపై త‌మ‌న్నా, ప్ర‌భుదేవా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన `అభినేత్రి 2`(2019)లో ఓ కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే, వ‌రుణ్ తేజ్ టైటిల్ రోల్ ప్లే చేసిన `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్` (2019) లో ఆడిపాడిన‌ ``సూప‌ర్ హిట్టు`` అనే స్పెష‌ల్ సాంగ్ తోనే తెలుగునాట త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

ఇదిలా ఉంటే.. తాజాగా డింపుల్ హ‌యాతి రెండు సినిమాల్లో నాయిక‌గా న‌టించింది. ఆ రెండు కూడా వారం వ్య‌వ‌ధిలో తెర‌పైకి రాబోతున్నాయి. ఆ చిత్రాలే.. `సామాన్యుడు`, `ఖిలాడి`.  విశాల్ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం `వీర‌మే వాగై సూడుమ్`.. తెలుగులో `సామాన్యుడు` పేరుతో ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కాబోతోంది. ఇక ర‌వితేజ ద్విపాత్రాభిన‌యంలో తెర‌కెక్కిన  `ఖిలాడి` ఫిబ్ర‌వ‌రి 11న జ‌నం ముందుకు రానుంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌యేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్స్ గానే తెర‌కెక్కాయి. మ‌రి.. వారం వ్య‌వ‌ధిలో రాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో డింపుల్ హ‌యాతి ఎలాంటి ఫ‌లితాల‌ను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com