అవును చైతూని తిట్టాను..
on Nov 1, 2016
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి స్టార్ ప్రోడ్యూసర్ గా క్రేజ్ తెచ్చుకున్నారు దిల్ రాజు. దిల్ రాజు బ్యానర్ లో సినిమా వస్తోంది అంటే అది ఖచ్చితంగా హిట్ అనే ముద్ర ప్రేక్షకుల్లో ఉంది. అయితే నిర్మాత కంటే ముందు రాజు డిస్ట్రిబ్యూటర్. నైజాం ఏరియాలో సినిమాలు రిలీజ్ చేసేది చాలా వరకు దిల్ రాజే. తాజాగా నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంభినేషన్ లో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ కు రెడీ అయ్యింది. నవంబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు.
ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి తాను నాగచైతన్యను తిట్టినట్లు తెలిపాడు. అయితే అది ఇప్పుడు కాదు. దిల్ రాజు చేతుల మీదుగానే చైతూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..ఆ మూవీ షూటింగ్ స్పాట్ లో తాను మరో సినిమాకు కూడా సైన్ చేశాను అని చెప్పాడట చైతన్య. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో లవ్ స్టోరీ అని అన్నాడు. దానికి నేను అదేంటి మన సినిమా శివ రేంజులో హిట్టయ్యి నువ్వు యాక్షన్ స్టార్ అయిపోతావు..ఈ లవ్ స్టోరీ ఎందుకు అని తిట్టాను. కానీ ఆ మూవీ సూపర్ హిట్టయ్యింది..మా మూవీ ప్లాప్ అయ్యింది. అని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు దిల్ రాజు.