"పోలీస్" ఈ పేరుతో గేమ్స్ వద్దు..!
on Apr 15, 2016

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తేరి చిత్రాన్ని తెలుగులో పోలీసోడుగా పేరుతో తెలుగులో విడుదల చేయడం వివాదాస్పదమైంది. దీనిపై తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం సీరియస్ కావడం..వెంటనే టైటిల్ మార్చడం వెంట వెంటనే జరిగిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల సంఘం ప్రెస్ మీట్ పెట్టి మరి మా జోలికి వస్తే తాట తీస్తామంటూ హెచ్చరించింది. ఖాకీలు, పోలీసోడు, మెంటల్ పోలీస్ అంటూ రక్షకభటుల మనోభావాలు దెబ్బతినేలా పేర్లే పెడుతున్నారని మండిపడ్డారు. ఇక నుంచి తమను కించపరిచే పదాలు ఉపయోగించినా..చులకనగా చూపించినా పరువు నష్టం, క్రిమినల్ కేసులు పెడతామని పోలీస్ అధికారుల సంఘం హెచ్చరించింది. సో..ప్రోడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ బీ కేర్ ఫుల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



