Home

»

Latest News

`ఎఫ్ 3`.. `దిల్` రాజు హిట్ సెంటిమెంట్!

Jan 27, 2022 2:06PM

నిర్మాత‌గా `దిల్` రాజుది 18 ఏళ్ళ‌కు పైగా సినీ ప్ర‌స్థానం. `దిల్` వంటి స‌క్సెస్ ఫుల్ వెంచ‌ర్ తో మొద‌లైన ఈ ప్ర‌యాణంలో ఎన్నో విజ‌యాలు చూశారు రాజు. దాదాపు అంద‌రు స్టార్స్ కాంబినేష‌న్ లోనూ సినిమాలు నిర్మించారు. అంతేకాదు.. సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ప్ర‌తీ ఏడాది త‌మ సంస్థ త‌ర‌పున చిత్రాలు విడుద‌ల చేస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. `దిల్` రాజు నుంచి ఈ సంవ‌త్స‌రం రానున్న చిత్రాల్లో `ఎఫ్ 3` ఒక‌టి. 2019 సంక్రాంతి విజేత `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ లో విక్ట‌రీ వెంక‌టేశ్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, సునీల్ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మాతృక ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 28న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ఏప్రిల్ నెల‌లో విడుద‌లైన `దిల్` రాజు చిత్రాల‌న్నీ విజ‌యం సాధించాయి. `దిల్` (2003), `మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్` (2011), `వ‌కీల్ సాబ్` (2021).. ఇలా రాజు నిర్మాణంలో వ‌చ్చిన సినిమాలు ఏప్రిల్ మాసంలో కాసుల వ‌ర్షం కురిపించాయి. మ‌రి.. ఈ జాబితాలో `ఎఫ్ 3` కూడా చేరి `దిల్` రాజు హిట్ సెంటిమెంట్  కొన‌సాగుతుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com