దిల్‌రాజు పార్టీలో పొంగిన 4 వేల మందు బాటిళ్లు
on Feb 8, 2017

ప్రజంట్ టాలీవుడ్‌లో మంచి జోష్‌లో ఉన్న నిర్మాత ఎవరు అంటే టక్కున గుర్తొచ్చేది దిల్‌రాజు పేరే. ఇటీవల ఈయన బ్యానర్ నుంచి రిలీజైన శతమానం భవతి, నేను లోకల్ సినిమాలు సూపర్, డూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్నాయి..అంతేకాకుండా పెట్టిన పెట్టుబడిని మించి లాభాలు తెచ్చిపెట్టడంతో దిల్‌రాజు ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం శతమానం భవతి 30 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టగా..నేను లోకల్ ఇప్పటి వరకు 20 కోట్ల షేర్ సాధించిందట.
దీంతో ఈ ఆనందాన్ని భారీగా సెలబ్రెట్ చేసుకోవాలని డిసైడయ్యారు రాజు గారు..ఇంకేముంది హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి శతమానం భవతి, నేను లోకల్ సినిమాలకు పనిచేసిన నటి, నటులు, టెక్నీషియన్లు, ఇతర యూనిట్ సభ్యులు మొత్తం 3,000 మంది హాజరయ్యారు. ఈ పార్టీలో నోరూరించే వంటకాలతో పాటు 4 వేల మద్యం బాటిళ్లను సిద్ధం చేయించారట. అన్నట్టు పార్టీకి సుమారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చయ్యిందట..అయినా కోట్ల రూపాయల లాభాల ముందు లక్షలు ఎంత..? ఎంతైనా దిల్‌రాజుకి లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కళంగా ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



