దిల్ రాజు బిగ్ రిస్క్.. వయలెంట్ డైరెక్టర్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్!
on Mar 20, 2025
ఇండియన్ సినీ హిస్టరీలో మోస్ట్ వయలెంట్ ఫిలిమ్స్ లో ఒకటిగా మలయాళం చిత్రం 'మార్కో' పేరు పొందింది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి హనీఫ్ అదేని దర్శకుడు. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం, వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. అయితే ఇందులో వయలెన్స్ ని చూడలేకపోయామని చెప్పిన వారు కూడా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ మార్కో డైరెక్టర్.. తెలుగులో ఒక సినిమా చేయనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. అది కూడా దిల్ రాజు బ్యానర్ లో అని న్యూస్ వినిపిస్తోంది. (Haneef Adeni)
టాలీవుడ్ లో ఎన్నో ఘన విజయాలు సాధించి, అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఎదిగిన దిల్ రాజు.. పాన్ ఇండియా నిర్మాతగానూ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే 'గేమ్ ఛేంజర్'తో ఆ దిశగా అడుగులు చేయగా.. ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఒక మంచి ప్రాజెక్ట్ తో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలని చూస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ మూవీ దిల్ రాజు నిర్మించే అవకాశముందని వార్తలొచ్చాయి. దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాకుండానే.. ఇప్పుడు అనూహ్యంగా మార్కో డైరెక్టర్ హనీఫ్ అదేని పేరు తెరపైకి వచ్చింది. దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి హనీఫ్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా మల్టీస్టారర్ అని సమాచారం. మరి ఈ సినిమాలో భాగమయ్యే స్టార్స్ ఎవరో తెలియాల్సి ఉంది. (Dil Raju)
హనీఫ్ అదేని మలయాళంలో ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చేస్తున్నాడు. ఇక 'మార్కో'లో అయితే మితిమీరిన వయలెన్స్ చూపించాడు. మరి ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న సినిమాని ఏ జానర్ లో చేస్తాడు? అందులో కూడా వయలెన్స్ ఉంటుందా లేదా? అనేది చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
