దిల్ రాజు సంచలన నిర్ణయం..సపోర్ట్ ఇవ్వమని కేటిఆర్ కి లేఖ
on Dec 31, 2024
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన హీరోలు,నిర్మాతలు,దర్శకులు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)ని కలవడం జరిగింది. ఈ భేటీ పై భారతీయ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్ఏ కేటిఆర్ కొన్ని విమర్శలు చేసాడు.
ఇప్పుడు ఈ విషయంపై ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(dil raju)ఒక బహిరంగ లేఖ విడుదల చేసాడు.అందులో గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు చాలాబాధాకరం. సీఎం గారితో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందే.తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి,మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం గారు కాంక్షించారు.హైదరాబాద్ ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం గారి బలమైన సంకల్పాన్నితెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది.అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని కూడా అందరిని కోరుతున్నాం.లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం,ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని తన లేఖలో పేర్కొన్నాడు.
Also Read