హైదరాబాద్‌లో భారీగా పెరిగిన టికెట్ ధరలు.. బెదిరిపోతున్న ప్రేక్షకులు!
on Dec 30, 2021

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు బయ్యర్లను బెదరగొడుతుంటే, హైదరాబాద్‌లో టికెట్ ధరలు ప్రేక్షకులను భయపెడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో టికెట్ ధరల పెంపు ఓ సమస్యగా మారింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం సిటీలోని పలు మల్టీప్లెక్సులు టికెట్ ధరలను పెంచుతున్నాయి. డిసెంబర్ 31 నుంచి ఈ మల్టీప్లెక్సుల్లో రూ. 295కు టికెట్లను అమ్మనున్నారు. ఒక్క ఏషియన్ మాత్రమే రూ. 175, రూ. 250 టికెట్లను అమ్మనుంది. ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్న, రేపు కొత్తగా రిలీజవుతున్న సినిమాలకు ఈ ధరలతోటే టికెట్లను విక్రయించనున్నారు.
Also read: 2021 జ్ఞాపకాలుః సత్తా చాటిన టాప్ స్టార్స్.. `స్టార్ ఆఫ్ ద ఇయర్` బాలయ్య!
మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరను రూ. 295 వరకు పెంచి అమ్ముకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొనగా, ఆ రేటునే సాధారణ టికెట్ ధరగా మల్టీప్లెక్సులు ఖరారుచేసి అమ్ముతుండటం సగటు ప్రేక్షకుడిని భయపెడుతోంది. భారీ, క్రేజీ సినిమాలకు ఈ రేటుతో టికెట్ కొని వెళ్లడానికి ప్రేక్షకులు ముందుకు వస్తారు కానీ, మిగతా సినిమాలకు ఇంతపెట్టి వెళ్లడానికి సిద్ధమవుతారా? అనేది ప్రశ్న.
Also read: తెలుగునాట రూ. 60 కోట్ల షేర్ మార్కును చేరుకున్న 'అఖండ'!
వారాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అప్పుడు ఎక్కువ ధరకు టికెట్లు అమ్మినా పర్వాలేదు కానీ, వారం మధ్యలోనైనా టికెట్ ధరలను తగ్గించాలని సినీ గోయర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. విడుదలైన వారం తర్వాత ఇంత భారీ ధరల టికెట్లతో పెద్ద సినిమాలను చూడ్డానికి ప్రేక్షకులు భయపడతారని వారంటున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ దృష్టిపెట్టకపోతే తలనొప్పి తప్పదు. నలుగురు సభ్యులు ఉండే కుటుంబం మల్టీప్లెక్సులో సినిమా చూడాలంటే టికెట్లకే సుమారు రూ. 1200 వెచ్చించాల్సిన పరిస్థితి. దీంతో వారు థియేటర్లను కాకుండా ఓటీటీని ఎంచుకొనే అవకాశం ఉంది. అంతే కాదు, బాగున్న సినిమాకు రిపీట్ ఆడియెన్స్ రావడం కూడా అరుదైపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో సమస్య ఒకలా, హైదరాబాద్‌లో సమస్య ఇంకోలా తయారవుతోందని సగటు ప్రేక్షకుడు వాపోతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



