Home

»

Latest News

Dhurandhar 2: గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఓటిటి డేట్ వచ్చేసింది

Apr 07, 2026

 

-థియేటర్స్ లో స్టిల్ అదరగొడుతూనే ఉంది 
 -1700 కోట్లకి పైగా గ్రాస్
-ఈ క్రమంలో ఓటిటి డేట్ చక్కర్లు  

ఇప్పుడు ఓటిటి మూవీ ప్రేమికుల్లో ఎవరి ఫేస్ చూసినా సరే ఒకేసారి పది దీపావళి పండగ కాంతులు మొత్తం ఒకేసారి వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే ధురంధర్ 2(Dhurandhar 2)ఓటిటి డేట్ న్యూస్ సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్ లోని పవన్ కళ్యాణ్ డైలాగ్ లా 'నాకు ఎవరు పోటీ కాదు. నాకు నేనే పోటీ అనే రీతిలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ లెక్కన ఓటిటి సినీ ప్రియుల ఆనందాన్ని దీపావళి కాంతులతో పోల్చడంలో ఎలాంటి తప్పు లేదు. మరి మనం కూడా ఓటిటి డేట్ చూసేద్దాం.


ధురంధర్ పార్ట్ 2 మే నెల 8 లేదా 15 తేదీల్లో స్ట్రీమింగ్ కి రావచ్చనే ప్రచారం చాలా జోరుగానే సాగుతుంది. వంద శాతం ఈ న్యూస్ నిజమవ్వచ్చు. మార్చి 18 ప్రీమియర్స్ నుంచే ధురంధర్ 2  థియేటర్స్ లో అడుగుపెట్టింది. అంటే మే 8 కల్లా 50 రోజులని పూర్తి చేసుకుంటుంది. మరి ఓటిటి చిత్రాలతో బాలీవుడ్ మేకర్స్ కుదుర్చుకున్న  ఒప్పందం ప్రకారం ధురంధర్ 2 అడుగుపెట్టడం మే 8 , 15 తేదీల్లో రావడం ఖాయం. ధురంధర్ పార్ట్ 1 కూడా ఈ కోవలోనే 50 రోజులు తర్వాత అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ధురంధర్ 2 స్ట్రీమింగ్ పార్టనర్ జియో హాట్ స్టార్.


Also read: Sreeleela: షూటింగ్ టైంలో పీరియడ్స్‌తో శ్రీలీల ఇబ్బంది! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్ 

ప్రస్తుతానికైతే థియేటర్స్ లో ధురంధర్ 2 తన హవాని యదావిధిగా కొనసాగిస్తూనే ఉంది. స్టిల్ 1700 కోట్లకి పైగా గ్రాస్ తో దూసుకుపోతు 2000 కోట్ల గ్రాస్ ని అందుకోవాలనే పట్టుదలని చూపిస్తున్నాడు. మరి ప్రేక్షక దేవుళ్ళు ఆ వరాన్ని అందిస్తారేమో చూడాలి. 
  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com