Home

»

Latest News

Dhurandhar 2: ధురంధర్2 పై మరో తాజా కేసు..సాంగ్ మాదే అంటు కోర్టుకి 

Apr 9, 2026 1:02PM

 

-ధురంధర్ 2 కి వరుస చిక్కులు 
-కథ విషయంలో కేసు రన్ అవుతూనే ఉంది 
-ఇప్పుడు మరో కేసు 
-సాంగ్ వాళ్లదేనంట

అదేం విచిత్రమో గాని ధురంధర్ 2(Dhurandhar 2)థియేటర్స్ లోకి ల్యాండ్ అయిన వేళ రాని కాపీరైట్ కేసులు ఇప్పుడు వరుసగా నమోదవుతున్నాయి. ఇటీవల ప్రముఖ కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్(Santhosh Kumar)ధురంధర్ 2 కథ తనదే అంటూ కేసు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు ముంబై లోని కోర్టు పరిధిలో ఉంది.  ఈ నెల 16 న తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరో కేసు ధురంధరుడుకి హాయ్ చెప్పింది. ఆ కేసు డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

ధురంధర్ 2 లో 'హమ్ ప్యార్ కర్నె వాలే' అనే సాంగ్ ఉంటుంది. 1989 లో వచ్చిన త్రిదేవ్ చిత్రంలోనిది. ఇప్పుడు ఈ సాంగ్ పై త్రిమూర్తి ఫిలిమ్స్ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సదరు పిటిషన్ లో 'హమ్ ప్యార్ కర్నెవాలా' సాంగ్ హక్కులు మా దగ్గరే ఉన్నాయి. ఆదిత్య ధర్(Aditya Dhar)తో పాటు నిర్మాణ సంస్థ బి 62 స్టూడియోస్ మా అనుమతి లేకుండా సాంగ్ ని ఉపయోగించారు. కాబట్టి సినిమాలో సాంగ్ ని తొలగించాలి లేదా, నష్ట పరిహారం చెల్లించాలని తన పిటిషన్ లో పేర్కొంది. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.


also read: Gautham Vasudev Menon: హైకోర్టు కీలక తీర్పు.. నాగ చైతన్య, సమంతల ఏ మాయ చేసావే గుర్తుంది కదా!

ప్రస్తుతానికైతే ధురంధర్ 'జిందగీ ఏక్ సఫర్ హై సుహానా' అనే రీతిలో ఆడుతు పాడుతు 1700 కోట్ల కలెక్షన్స్ వరకు రాబట్టింది. 2000 కోట్లకి చేరాడేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్న వేల వరుస కేసుల రాకతో ఆ 2000 కోట్ల ఫిగర్ కూడా అందుకుంటుందేమో చూడాలి. వైరల్ న్యూస్ కి ఉన్న కెపాసిటీ అదే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com