Home

»

Latest News

`ఖిలాడి` కూడా ఆ జాబితాలో చేరుతుందా!?

Jan 21, 2022 1:49PM

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ అంటే చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ కి మాత్ర‌మే కాదు.. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ కి కూడా కేరాఫ్ అడ్ర‌స్ నే. గ‌త ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద‌కాలంలో తెలుగునాట ప‌లు ఘ‌న‌విజ‌యాల‌కు చిరునామాగా నిలిచాడు ఈ టాలెంటెడ్ కంపోజర్. ఇక రీసెంట్ గా `పుష్ప - ద రైజ్`తో తొలి పాన్ - ఇండియా హిట్ ని అందుకున్న డీఎస్పీ.. సంక్రాంతికి రిలీజైన `రౌడీ బాయ్స్`కి కూడా త‌న బాణీల‌తో ఎస్సెట్ గా నిలిచాడు.

ఇదిలా ఉంటే.. ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో దేవిశ్రీ నుంచి రానున్న కొత్త చిత్రాల్లో `ఖిలాడి` ఒక‌టి. ట్రేడ్ వ‌ర్గాలు అన్ సీజ‌న్ గా భావించే ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రిలీజ్ కానుంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. డీఎస్పీ ఖాతాలో ఫిబ్ర‌వ‌రి నెల ప‌రంగా చెప్పుకోద‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ ఉన్నాయి. `మిర్చి` (2013), `నేను లోక‌ల్` (2017), `ఉప్పెన‌` (2021).. ఇలా రీసెంట్ టైమ్స్ లో ఫిబ్ర‌వ‌రి మాసంలో మంచి ట్రాక్ రికార్డ్ నే కంటిన్యూ చేస్తున్నాడు దేవిశ్రీ. మ‌రి.. ఈ సినిమాల జాబితాలో `ఖిలాడి` కూడా చేరుతుందేమో చూడాలి.

కాగా, మాస్ మ‌హారాజా ర‌వితేజ ద్విపాత్రాభినయం చేసిన `ఖిలాడి`కి ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యాక్ష‌న్ హీరో అర్జున్ ఓ ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో ర‌వితేజ‌కి జంట‌గా మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 11న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లోకి రానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com