ఇది కద రికార్డు అంటే
on Oct 15, 2024
యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దేవర(devara)కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఐదు వందల పది కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసి ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ కట్ అవుట్ కి ఉన్న స్టామినాని మరో సారి చాటి చెప్పింది. తాజాగా మరో అరుదైన రికార్డుని సాధించి హాష్ టాగ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.
సీడెడ్(ceeded)ఏరియాకి సంబంధించి ముప్పై కోట్ల రూపాయిల షేర్ సాధించి దేవర పెద్ద సంచలనమే సృష్టించింది. కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ముప్పై కోట్లు అందుకోవడం ఒక రికార్డు అని చెప్పవచ్చు.ఎన్టీఆర్ గత చిత్రమైన ఆర్ఆర్ఆర్ అయితే ఓవర్ ఆల్ గా యాభై ఒక్క కోట్ల షేర్ ని సాధించింది. దీంతో రాయలసీమ గడ్డ మీద ముప్పై కోట్ల రూపాయల షేర్ ఉన్న
ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు.
ఇక దేవర మొదటి పార్ట్ విజయంతో రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇటీవల మాట్లాడుతు మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Also Read