Home

»

Latest News

పైరసీకి గిరాకీ... పెరిగిందండోయ్

Apr 21, 2020 11:09AM

 

అవును... 
పైరసీకి గిరాకీ పెరిగిందండోయ్!
ఏదో ఒకట్రెండు దేశాల్లో కాదు... 
ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగింది!

కరోనా ధాటికి ప్రపంచంలో ఉద్యోగాలు కోల్పోతున్న ప్రజలు కోకొల్లలు. ఇక, కుప్పకూలుతున్న వ్యాపారాల సంఖ్య చెప్పనవసరం లేదు. ఏ వ్యాపారంలో చూసినా నష్టాలు, ఏ దేశంలోని ఉద్యోగస్తులను పలకరించినా భయాందోళనలు. ఈ నేపథ్యంలో పోర్న్ సైట్లు, పైరసీ సైట్లు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. జనవరి నుండి పోర్న్ సీట్లు చూసే వీక్షకుల శాతం 300 పెరిగిందని ఒక సర్వేలో పేర్కొన్నారు. ఇక, పైరసీ విషయానికి వస్తే...  

ఇండియాలో అయితే 62 శాతం, కరోనా పుట్టినిల్లు వూహాన్ ఉన్న చైనాలో జనవరి 18 నుండి 26 వరకూ 89 శాతం ఎక్కువమంది పైరసీ సైట్ల నుండి సినిమాలు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇండియాలో లాక్ డౌన్ విధించడానికి ముందు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'బాఘీ 3', ఇర్ఫాన్ ఖాన్ 'అంగ్రేజీ మీడియం' సినిమాలు విడుదలయ్యాయి. ఆ రెండు పైరసీ బారిన పడ్డాయి. చైనాలో ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ 'పారసైట్', 'కాగ్నిజెంట్', 'పాండమిక్' సినిమాలు ఎక్కువ డౌన్‌లోడ్ చేసుకున్నారట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే జనవరి నుండి సగటున టొరెంట్ సైట్లలో 36.39 శాతం గ్రోత్ కనిపించిందట. 

కొత్త సినిమాలు రావడం లేదు... థియేటర్లు మూసేశారు. ఇప్పుడు పైరసీ ఏంటి? అని కొంద‌రికి సందేహం రావచ్చు. ఆల్రెడీ రిలీజైన సినిమాలు ఉంటాయి కదా! వాటి పైరసీ ప్రింట్స్ కోసం ఇళ్లలో ఉంటున్న జనాలు వెతుకులాట మొదలుపెట్టారు. అవి దొరికితే డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com