Home

»

Latest News

Deepika padukone: దీపికా పదుకునే ఎమోషనల్ పోస్ట్.. ఫ్యాన్స్ కన్నీరు

Aug 3, 2026 2:24PM

 

భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హీరోయిన్ దీపికా పదుకునే(Deepika padukone).. కోట్లాది మంది అభిమానులు ఆమె సొంతం. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ డ్రీం ప్రాజెక్ట్ రాకా తో బిజీగా ఉంది.  రీసెంట్ గా దీపికా సోషల్ మీడియా వేదికగా చేసిన రీల్  వైరల్ గా మారింది  


సదరు రీల్ లో ' సాధారణంగా గర్భవతిగా ఉన్న సమయంలో శారీరకంగా జాగ్రత్తలు పాటిస్తూ, బరువులు ఎత్తకూడదని పెద్దలు, వైద్యులు చెబుతుంటారు. కానీ నా చిన్నారి దువాను ఎత్తుకుని గడిపే ప్రతి క్షణం నాకు అపారమైన సంతోషాన్ని ఇస్తుంది. ఆ మధురమైన క్షణాలను నేను జీవితంలో ఎప్పటికీ మిస్ కావాలనుకోవడం లేదు" అంటూ ఆమె రాసుకొచ్చిన క్యాప్షన్ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది.

Also read: జాతకాల కోసమే నెలకి 10000 ఖర్చు. షాక్ ఇచ్చిన హీరోయిన్ 


సాధారణంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, పిల్లల వివరాలను చాలా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించే దీపికా పదుకొనే, ఇలా సడన్‌గా తన భావోద్వేగాలను బయటపెట్టడంతో అభిమానులు ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి లోనవుతున్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలు సాధించి రికార్డు సృష్టించింది. లక్షలాది మంది నెటిజన్లు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ పోస్ట్‌పై స్పందిస్తూ, లవ్ ఎమోజీలతో తమ ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ ఆమె మాతృత్వపు ప్రేమని  కొనియాడుతున్నారు.

Deepika padukone, Raaka, Allu Arjun

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com