'దసరా' బాక్సాఫీస్.. రెండు రోజుల్లో 60 శాతం రికవరీ!
on Apr 1, 2023
నాని హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'దసరా' రెండో రోజు కలెక్షన్లు నెమ్మదించాయి. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 21 కోట్ల షేర్‌తో సంచలనం సృష్టించిన ఈ సినిమా రెండో రోజు రూ. 8 కోట్ల షేర్ సాధించింది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. అయితే రెండు రోజుల్లో రూ. 29 కోట్ల షేర్ రాబట్టడం కూడా చాలా పెద్ద విషయమే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 14.22 కోట్ల షేర్ రాబట్టిన 'దసరా' మూవీ, రెండో రోజు రూ. 5.86 కోట్ల షేర్ వసూలు చేసింది. వెరసి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు రూ. 20 కోట్ల మార్కును దాటాయి. తెలంగాణలో రెండో రోజు శుక్రవారం రూ. 3.48 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.72 కోట్లు, రాయలసీమలో రూ. 66 లక్షలు వసూలయ్యాయి. రెండు రోజులను లెక్కలోకి తీసుకుంటే దసరా సినిమా తెలంగాణలో రూ. 10.26 కోట్లు, ఆంధ్రాలో రూ. 6.80 కోట్లు, రాయలసీమలో 3.02 కోట్ల షేర్ వసూలు చేసింది.
తెలుగు తప్ప మిగతా భాషల్లో 'దసరా' ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోందని చెప్పాలి. అయితే ఓవర్సీస్‌లో మాత్రం సినిమా అదరగొడుతోంది. అక్కడ రెండు రోజుల్లో 5.6 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో కలిపి రూ. 29.08 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రి బిజినెస్ విలువ సుమారు రూ. 48 కోట్లు. అంటే రెండు రోజుల్లోనే 60 శాతంపైగా రికవరీ అయ్యింది. మౌత్ టాక్ బాగా ఉండటం, శని, ఆది వారాల్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండటంతో వీకెండ్ నాటికి బ్రేకీవెన్ సాధించవచ్చనే నమ్మకం వ్యక్తమవుతోంది.
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కథకు కేంద్రబిందువు అయిన వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ నటించగా, దీక్షిత్ శెట్టి, షైన్ టాం చాకో, సముద్రకని, సాయికుమార్ కీలక పాత్రలు చేశారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
