దర్శన్ కేసులో బిగ్ ట్విస్ట్..కోర్టు ఏం చేయబోతుంది
on Apr 10, 2025
.webp)
రేణుకస్వామి హత్యకేసులో సినీనటుడు దర్శన్(darshan)కొన్నినెలల పాటు జైలు శిక్షఅనుభవించిన అనంతరం ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే.కాకపోతే కోర్టు నిబంధనల ప్రకారం కేసు విచారణ సమయంలో దర్శన్ కోర్టులో తప్పని సరిగా హాజరు కావాలి.కానీ నిన్న మంగళవారం జరిగిన విచారణకి హాజరు కాలేదు.
నడుం నొప్పి కారణంగానే దర్శన్ విచారణకి హాజరుకాలేదని ఆయన తరుపు లాయర్ కోర్టుకి చెప్పడం జరిగింది.దీంతో ఆ సమాధానంపై సంతృప్తి పడని న్యాయమూర్తి,కేసు విచారణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోను దర్శన్ కోర్టులో ఉండాలి.ఇలాంటి సాకులు చెప్తు హాజరు కాకపోతే ఎలా అంటు తన ఆగ్రహాన్నివ్యక్తం చేసాడు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే కోర్టులో కేసు పూర్తయిన కొన్నిగంటల్లోనే దర్శన్ బెంగుళూరులోని థియేటర్ లో 'వామన'అనే స్పెషల్ షో స్క్రీనింగ్ కి వెళ్ళాడు.మూవీ కంప్లీట్ అయ్యాక మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది.అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో పలువురు నెటిజన్స్ దర్శన్ తీరుపై మండిపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



