డాకు మహారాజ్ అల్లకల్లోలం..బాలయ్య ఫాన్స్ ని ఆపగలరా
on Jan 3, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(balakrishna)నుంచి సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్'(daku maharaj)రానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు,టీజర్ తో సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్,ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరుసగా బాలకృష్ణ అభిమానుల మధ్య ఘనంగా జరగబోతున్నాయి.
ఇక అల్లకల్లోలం మరియు రక్తపాతంతో థియేటర్లను తగలబెట్టే భారీ విధ్వంసానికి కేవలం 9 రోజులు మాత్రమే ఉన్నాయంటు 'డాకు మహారాజ్' టీం రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది.అందులో డాకు మహారాజ్ గెటప్ లో బాలకృష్ణ రక్తంతో తడిచిన పొడవాటి కత్తిని చేతిలో పట్టుకొని ఉండగా రక్తం యొక్క ఆర తొమ్మిది రోజులనే అంకె ని చూపించింది.
ఇక ఈ మూవీలో బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్Pragya Jaiswal)శ్రద్ద శ్రీనాద్(Shraddha Srinath)జత కట్టగా బాబీ(bobby)దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ నుంచి వస్తున్న సినిమా డాకు మహారాజ్ నే కావడంతో అందరిలో ఆసక్తి కూడా నెలకొని ఉంది.సితార ఎంటర్ టైన్మెంట్ అండ్ ఫార్చ్యూన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇప్పటికీ మూడు పాటలు రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది
Also Read