రిలీజ్ కి ముందే డాకు మహారాజ్ అరుదైన రికార్డు
on Jan 7, 2025
నందమూరి నటసింహం,గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్'(Daku Maharaj)గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచారచిత్రాలు,ట్రైలర్,సాంగ్స్ బాలయ్య మాస్ రేంజ్ కి తగ్గట్టుగా ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా 'డాకు మహారాజ్' వచ్చే 12 వ తారీకు కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ మాట అక్షర సత్యమని చాటి చెప్పేలా ప్రముఖ ఆన్ లైన్ యాప్ 'బుక్ మై షో'లో 'డాకు మహారాజ్' కి 2 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ నమోదు అయ్యాయి.దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు డాకు మహారాజ్ కోసం ప్రేక్షకులు,అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అని. రేపు మూవీ రిలీజ్ అయ్యాక 'డాకు మహారాజ్' సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని నందమూరి అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించగా ప్రగ్యా జైస్వాల్,శ్రద్దా శ్రీనాథ్, లు హీరోయిన్లుగా చేస్తుండగా కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కూడా ఒక కీలక పాత్రల్లో కనిపిస్తుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బాలకృష్ణ కెరీరి లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించగా వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ దర్శకుడు. ఇక ఈ మూవీ బెనిఫిట్ షో ఆంధ్రప్రదేశ్ లో తెల్లవారు జామున నాలుగు గంటలకి పడనుంది.తెలంగాణాలో మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.ధరల విషయంలో కూడా ఏపి ప్రభుత్వం మొదటి రెండు వారాలు పెంచుకునేలా అనుమతి ఇవ్వగా ఈ విషయంలో కూడా తెలంగాణాకి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది.
Also Read