తలైవా 170వ సినిమాలో రానా దగ్గుబాటి.. ఎలాంటి క్యారెక్టర్ అంటే!
on Oct 3, 2023
‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ చేయబోయే 170వ సినిమాకి సంబంధించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ఎంతో భారీగా నిర్మించనుంది. ఈ సినిమాలో నటించే ఇతర తారాగణం గురించి గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే రితికా సింగ్, దుషారా విజయన్, మంజు వారియర్ ఎంపికయ్యారు.
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఒక కీలక పాత్ర పోషిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ సినిమాలో రానా క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. రానా అయితేనే ఆ క్యారెక్టర్‌కి సరిపోతారని మేకర్స్ భావించారట. ‘జైలర్’ సినిమాలో కన్నడ నుంచి శివరాజ్‌కుమార్, మలయాళం నుంచి మోహన్‌లాల్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ నటించడం సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఇప్పుడు రజనీ 170వ సినిమాలో కూడా ఇదే సెంటిమెంట్‌ను కొనసాగించే అవకాశం ఉన్నట్టుంది. మరి ఈ సినిమాలో ఇంకా ఎవరెవరిని తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ‘జైలర్’ సినిమా ఎక్స్‌లెంట్ మ్యూజిక్ చేసిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించనున్నారు.
Also Read