Dacoit Teaser: కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. డెకాయిట్ టీజర్ అదిరింది!
on Dec 18, 2025

విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడివి శేష్. ఆయన నటించిన సినిమా అంటే.. అందులో కంటెంట్ బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకులలో ఉంటుంది. అలాంటి శేష్ నుంచి.. 2022లో వచ్చిన 'మేజర్', 'హిట్-2' తర్వాత హీరోగా సినిమా రాలేదు. శేష్ ప్రేక్షకులను పలకరించి మూడేళ్లు అయిపోయింది. ఆ లోటుని భర్తీ చేసేలా.. 2026లో 'డెకాయిట్', 'గూఢచారి-2' సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మూవీ 'డెకాయిట్'. శనియేల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఉగాది కానుకగా 2026 మార్చి 19న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
నిమిషంన్నర నిడివితో రూపొందిన 'డెకాయిట్' టీజర్ ఆకట్టుకుంటోంది. 'ఒక ప్రేమ కథ' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్నప్పటికీ.. ఇందులో రొమాన్స్ కంటే కూడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండనున్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. జైలు నుంచి వచ్చిన క్రిమినల్ పాత్రలో శేష్ కనిపిస్తున్నాడు. మృణాల్ తో కలిసి శేష్ ఒక రాబరీ చేయడానికి సిద్ధపడటం? అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా? అనే కోణంలో టీజర్ ను కట్ చేశారు.
టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా 'కన్నె పిట్టరో కన్ను కొట్టరో' సాంగ్ రావడం హైలైట్ గా నిలిచింది. ఆ సాంగ్ టీజర్ కి కొత్త లుక్ తీసుకొచ్చింది. అలాగే, టీజర్ లో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ వంటి ప్రముఖ నటులు కనిపించారు. ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ మైక్ లో "ఓ..ఓ.." అని హమ్ చేస్తుండగా టీజర్ ఎండ్ అవ్వడం మెప్పించింది.
Also Read: రాజా సాబ్ సాంగ్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్!
'డెకాయిట్'లో అడివి శేష్, మృణాల్ ప్రేమించుకొని విడిపోతారు. ఈ మాజీ ప్రేమికులు ఒక క్రైమ్ వల్ల మళ్ళీ కలవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు.. ట్విస్ట్ లు, ఛేజ్ లు, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఈ సినిమా నడవనుందని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



