బాక్సాఫీస్ దగ్గర బాలయ్య తాండవం.. 'డాకు మహారాజ్' వసూళ్ల వర్షం..!
on Jan 15, 2025
'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన చిత్రం 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. సంచలన వసూళ్లను రాబడుతూ బాలయ్య కెరీర్ లో వరుసగా నాలుగో విజయం దిశగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.90 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన 'డాకు మహారాజ్'.. నాలుగో రోజు వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టనుంది.
'డాకు మహారాజ్' సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.56 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.74 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ రూ.18 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.92 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరనుంది. ప్రస్తుత వసూళ్ల జోరు చూస్తుంటే.. ఫుల్ రన్ లో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read