అల్లు అర్జున్20కి దెబ్బ మీద దెబ్బ?
on Mar 11, 2020

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ సజావుగా, అనుకున్న విధంగా సాగడం లేదు. ప్రతిసారీ ఏదో ఒక అడ్డు వచ్చి పడుతోంది. 'అల... వైకుంఠపురములో' విడుదలైన వెంటనే స్పీడుగా షూటింగ్ చేయాలని అనుకున్నారు. 'అల...' ఘనవిజయం సాధించడంతో ఆ సినిమా యూనిట్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, డైరెక్టర్స్... ఇలా వరుసగా అల్లు అర్జున్ పార్టీలు ఇచ్చుకుంటూ వచ్చారు. దాంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది. తర్వాత అల్లు అర్జున్ మేనమామ, సినిమా సహ నిర్మాత కాలం చేశారు. దాంతో ఇంకొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది. ఇలా ఏదో సెలబ్రేషన్, సమస్య, ఇంకేదో వచ్చి పడ్డాయి. లేటెస్టుగా ఈ సినిమా షూటింగ్ మీద కరోనా ఎఫెక్ట్ పడిందని టాక్. మొదట ఈ సినిమా యాక్షన్ సీన్స్ బ్యాంకాక్ అడవుల్లో తీయాలనుకున్నారు. కరోనా దెబ్బకు అక్కడికి వెళ్లకుండా కేరళలో వెళదామని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు కేరళలో పరిస్థితి కూడా బాలేదు. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో డైలమాలో పడ్డారట. జార్జియా లేదా యూరప్ దేశాల్లో కరోనా సోకని దేశాన్ని ఎంపిక చేసుకుని షూటింగ్ చేయాలనుకుంటున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



