సప్తగిరి పాలిట హేమ ఆంటీ విలన్..
on Nov 12, 2016

ఆరు అడుగుల హైట్‌తో..గోదావరి యాసతో కమెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ లేడి కమెడియన్‌గా స్టార్ స్టేటస్ అందుకొంది హేమ. తెలుగులో బడా కమెడియన్ల అందరి పక్కన నటించిన హేమ..క్యారెక్టర్ ఆర్టిస్టుగా అమ్మ, వదిన, అక్క, పిన్ని పాత్రలతో బిజీగా మారింది. అయతే సీనియర్ హీరోయిన్లంతా సెకండ్ ఇన్నింగ్స్‌లు స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తడంతో హేమ లాంటి వారికి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో తనలో ఉన్న మరో కోణాన్ని చూపించడానికి రెడీ అయ్యింది. కమెడియన్ సప్తగిరి హీరోగా పరిచయం అవుతున్న సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో హేమ విలన్‌గా ఎంట్రి ఇస్తోంది. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించిన హేమ ఆంటీ..ఈ మూవీతో పూర్తిస్థాయి విలన్‌గా మారుతుందన్న మాట. ఈ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండటంతో పాటు మెయిన్ విలన్ హేమనే అట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



