శ్రియను కౌగిలించుకోవాలనుకున్నా!
on Jan 29, 2018

మోహన్ బాబూ రూటే సపరేటు. తాను ఏం మాట్లాడినా.. అందులో ఆయప మార్క్ ఉండాల్సిందే. అప్పుడప్పుడు అవి కాంట్రవర్సీకి కారణం అవుతుంటాయ్ కూడా. ఆయన రీసెంట్ సినిమా ‘గాయత్రి’ ఆడియో వేడుకలో కూడా తన దైన శైలిలో ప్రసంగించాడు మోహన్ బాబు. అయితే.. ప్రసంగం మధ్య.. ఆయన అన్న ఓ మాట.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఈ సినిమా షూటింగ్ లో శ్రియను కౌగిలించుకుందాం అనుకున్నాను. కానీ... లొకేషన్లో విష్ణు ఉండటంతో ధైర్యం చేయలేకపోయా’ డైరెక్ట్ గా అనేశాడు మోహన్ బాబు. ఆయన ఈ మాట అనేసరికి... శ్రియ కూడా కాసేపు ఇబ్బందిగా ఫీలయ్యింది.
అయితే... తర్వాత ఆయన వివరణ ఇస్తూ... ‘ఇందులో శ్రియ చేసిన పాత్రను ఇప్పుడున్న ఏ హీరోయినూ చేయలేదు. అంత అద్భుతంగా చేసింది. ఆమె నటన చాలా సందర్భాల్లో మనల్ని కంటతడి పెట్టిస్తుంది కూడా. అందుకే.. ఆ భావావేశంలోనే ఆమెను అభినందనగా కౌగిలించుకుందాం అనుకున్నాను. అంతేతప్ప మరొకటి కాదు‘ అని చెప్పుకొచ్చారు.
అంతేకాదు... తన భార్య ఎప్పుడూ తననను ‘బావా...!* అని పిలిచేదని.. ఈ మధ్య సక్సెస్ లేకపోయేసరికి అలా పిలవడం మానేసిందనీ.. ఆయితే... ఆ లోటును అనసూయ తీర్చేసిందనీ... తను నన్ను ఇందులో బావా అని పిస్తుందనీ.. అంటూ స్టేజ్ పై మోహన్ బాబు విసిరిన చమక్కులు ఆహుతులందర్నిన్నీ నవ్వుల్లో ముంచెత్తాయ్. మోహన్ బాబు హీరోగా నటించిన గాయత్రి త్వరలోనే విడుదల కానుంది. మదన్ ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



