కరోనా కాలం.. ఇండోనేషియాలో ఔట్‌డోర్ సినిమాని భలే ఎంజాయ్ చేస్తున్నారు!
on Dec 2, 2020
ఇండోనేషియా నగరమైన బాండుంగ్‌కు ఎదురుగా ఉన్న ఒక కొండపై ఉన్న టీపీ-శైలి గుడారాలు ప్రతి సాయంత్రం ఒక పెద్ద స్క్రీన్ ముందు పచ్చిక బయళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. 'సినిమా అండర్ ద స్టార్స్' అనే పేరుతో ఔట్‌డోర్ క్యాంప్ స్టైల్ స్థలాన్ని ఇండోనేషియాలో అత్యధిక జనాభా కలిగిన పశ్చిమ జావా రాజధానిలో సామాజిక దూరం పాటిస్తూ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ను అందించే లక్ష్యంతో రెండు నెలల క్రితం ప్రారంభించారు.
"సాధారణంగా ఇండోర్‌లో సినిమాలను చూస్తుంటాం. కానీ ఇప్పుడు మాకు ఇలాంటి ఔట్‌డోర్ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేమంటే, టెంట్ల దగ్గర కూర్చొని, హాయిగా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు" అని బాండుంగ్ నివాసి 20 ఏళ్ల లిడియా ఉటారి తెలిపింది.
ఈ టెంట్ల దగ్గర్నుంచి సినిమాలు చూసే ప్రేక్షకులందరికీ నిర్వాహకులు దిండ్లు, దుప్పట్లు, తింటానికి స్నాక్స్‌తో పాటు హ్యాండ్ శానిటైజర్లు సప్లై చేస్తున్నారు. అన్ని రకాల ఆరోగ్య నిబంధనలు పాటిస్తున్నారు. టెంట్ ఎంట్రెన్స్ వద్ద ఏర్పాటుచేసిన చిన్నపాటి టేబుల్‌పై క్యాండిల్లైట్తో పాటు ఫుడ్, డ్రింక్ రెడీగా ఉంటాయి. ప్రేక్షకులు ఆ టేబుల్ ముందు కూర్చొని తింటూ ఎదురుగా ఉన్న బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శించే సినిమాను ఎంజాయ్ చేస్తూ తిలకిస్తున్నారు.
అక్కడ 28 టెంట్లు ఉంటే, ఒక్కో టెంట్లో ముగ్గురిని మాత్రమే అనుమతిస్తారు. ఒక్కో టెంట్ కాస్ట్ 215,000 రూపియాలు. మన భారతీయ కరెన్సీ ప్రకారం 1,120 రూపాయలు.
"కరోనా మహమ్మారి కాలంలో ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేశాం. 'సినిమా అండర్ ద స్టార్స్' అనే కాన్సెప్ట్‌కు సినీ ప్రియులు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఓ వైపు వినోదాన్ని అందిస్తూ, ఇంకోవైపు ఓపెన్ స్పేస్‌లో క్యాండిల్ లైట్ వెలుతుర్లో టెంట్ల ముందు కూర్చొని సినిమా చూడటమనే అనుభవాన్ని వారు ఎంజాయ్ చేస్తున్నారు" అని నిర్వాహకుల్లో ఒకరైన ఇల్హమ్ ఫరీ సుహదా తెలిపారు.
Also Read