చిరుకి మా తరుపున సన్మానం ఉంటుంది
on Jan 27, 2024
నాలుగున్నర దశాబ్దాలుగా తన అధ్బుతమైన నటనతో, డాన్సులతో ,ఫైట్స్ తో కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్నిపొందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమాని రెండు భాగాలు గా విభజిస్తే చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని సంభోదించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ని ఆయనకి ప్రకటించింది. దీంతో పద్మభూషణ్ చిరంజీవి కాస్త పద్మవిభూషణ్ గా మారారు.ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్టాల్లో చర్చలు జరుగుతున్నాయి.
చిరంజీవికి పద్మవిభూషణ్ లభించిన సందర్భంగా దిల్ రాజు చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ లభించడం పట్ల తెలుగు పరిశ్రమ మొత్తం చాలా గర్వంగా ఉందని అతి త్వరలోనే పరిశ్రమ తరుపున చిరంజీవి గారిని ఘనంగా సన్మానిస్తామని ఆయన చెప్పారు.అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి తెలుగు పరిశ్రమ మొత్తం తరలివస్తుందని త్వరలోనే ఆ ఫంక్షన్ ని సంబంధించిన మిగతా వివరాలని కూడా వెల్లడి చేస్తామని ఆయన చెప్పారు.దిల్ రాజు ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గా ఉన్నాడు.
అలాగే తెలుగు చిత్ర సీమకి చెందిన కే రాఘవేంద్ర రావు, రాజమౌళి, సంపత్ నంది, తమ్మారెడ్డి భరద్వాజ .మోహన్ బాబు, రవితేజ,మంచు విష్ణు ,అడవి శేషు, శ్రీకాంత్,శ్రీ విష్ణు, ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ తదితరులు చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరువున సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా చిరుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read