'చిత్రలహరి' వచ్చేది ఎప్పుడంటే?
on Mar 8, 2019

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చిత్రలహరి' విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 12న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అమెరికాలో ఒక్క రోజు ముందు... అనగా ఏప్రిల్ 11న ప్రీమియర్ షోలు పడతాయి. ఈ సినిమా విడుదలైన రెండు వారాలకు నాని 'జెర్సీ' థియేటర్లలోకి వస్తుంది. 'చిత్రలహరి' విడుదలకు రెండు వారాల ముందు 'మజిలీ' విడుదలవుతోంది. ఈ మూడు సినిమాల విడుదల మధ్య రెండేసి వారాలు గ్యాప్ ఉండటంతో మౌత్ టాక్ బావున్న సినిమా మంచి హిట్టయ్యే అవకాశాలు ఉన్నాయి. 'తిక్క' నుంచి 'తేజ్ ఐ లవ్యూ' వరకూ సాయిధరమ్ తేజ్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్ల తరవాత అతడి నుంచి వస్తున్న సినిమా అయినప్పటికీ.. ప్రేక్షకుల్లో సినిమాపై క్రేజ్ బావుంది. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాల ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకుడు కావడం... సాయిధరమ్ తేజ్ లుక్ మారడం... మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నిర్మాతలు కావడం... సినిమాకు కలిసి వచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



