చిరంజీవి vs బాలకృష్ణ vs వెంకటేష్.. ట్రయాంగిల్ ఫైట్!
on Feb 1, 2026

టాలీవుడ్ సీనియర్ స్టార్స్ చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్(Venkatesh) బాక్సాఫీస్ బరిలో దిగితే ఎలా ఉంటుంది?. వచ్చే సంక్రాంతి ఈ ట్రయాంగిల్ ఫైట్ కి వేదికగా మారేలా ఉంది.
ఈ 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిరంజీవి, వచ్చే సంక్రాంతికి కూడా సై అంటున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి 158వ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'వీరసింహారెడ్డి' కాంబో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి చేతులు కలిపారు. బాలకృష్ణ కెరీర్ లో 111వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకటేష్, 2027 సంక్రాంతికి కూడా అదే రిజల్ట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. 2025 సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం', 2026 సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో సంచలన విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ వెంకీతో కావడం విశేషం. 2027 సంక్రాంతి టార్గెట్ గానే దీనిని రూపొందిస్తున్నారు.
'సంక్రాంతికి వస్తున్నాం'తో వెంకటేష్, 'మన శంకర వరప్రసాద్ గారు'తో చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోవైపు బాలకృష్ణకు కూడా సంక్రాంతికి వచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర ఉంది. అందుకే ఈ ముగ్గురు సంక్రాంతి బరిలో దిగుతున్నారన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



