‘సైరా’... బుడ్డోడా!
on Jan 27, 2018
పిల్లలు ఏ హీరోనైతే అమితంగా ఇష్టపడతారో... ఆ హీరో కచ్చితంగా నంబర్ వన్ అవుతాడు. దానికి ఉదాహరణే... నటరత్న ఎన్టీయార్, మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరినీ... పిల్లలు అమితంగా ఇష్టపడేవారు. ఎన్టీయార్ హీరోగా ఉన్న కాలంలో... నాటి పిల్లలకు ఆయనే రాబిన్ హుడ్. గత 30 ఏళ్లుగా అదే స్థాయిలో పిల్లల్ని అలరిస్తున్న స్టార్... మెగాస్టార్ చిరంజీవి. చిన్నపిల్లలకు సూపర్ మేన్, స్పైడర్ మేన్, ఐరన్ మేన్, హీమేన్... ఇలా ఏ మేన్ అయినా.. మెగాస్టారే.
చిరంజీవిలోని ఆకర్షణాశక్తి అలాంటిది.
10 ఏళ్ల విరామం తర్వాత ఆయన ‘ఖైదీ నంబర్ 150‘ చేస్తే... ఆ సినిమాను నేటి పిల్లలు కూడా విరగబడి చూశారు. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన ‘సైరా నరసింహారెడ్డి’ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ లో వెనకకు తిరిగి నిలబడి ఉన్న చిరంజీవి గెటప్... అభిమానులకే కాదు.. అందరికీ నచ్చేసింది. ఇక పిల్లలకైతే చెప్పేదేముంది... ఎక్కడలేని ఆసక్తి. దానికి ఉదాహణ ఇక్కడున్న బుడ్డోడు. ఇంతకీ ఈ బుడ్డోడెవరు? ఈ బుడ్డోడికి ‘సైరా’ గెటప్ అంతబాగా నచ్చడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకెళ్తే...
ఈ బంగారుతండ్రి ఎవరో కాదు... ‘సైరా నరసింహారెడ్డి’ దర్శకుడు సురేందర్ రెడ్డి తనయుడు. లొకేషన్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ ని చూశాడు. అంతే.. నాక్కూడా అలాంటి కాస్ట్యూమ్సే కావాలని గోల గోల పెట్టాడు. దాంతో... ఇక చేసేదిలేక...సురేందర్ రెడ్డి... అదే టైప్ లో కాస్ట్యూమ్స్ బుడ్డోడికి కుట్టించి తొడిగాడు. ఇంకేముందీ... బుల్లి కత్తిని ఒకదాన్ని చేతపట్టి... ఇంట్లో రణరంగాన్నే సృష్టించేశాడట. తానే నరసింహారెడ్డిగా ఫీలైపోయి.. ఆ కుర్రాడు కత్తి తిప్పుతుంటే... సురేందర్ రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయిందట. ఇక్కడున్న ఈ పిల్లోడి స్టిల్స్ చూడండీ... బుల్లి నరసింహారెడ్డి... భలే ఉన్నాడు కదూ!