ENGLISH | TELUGU  

చిరంజీవి కత్తిలో సునీల్ క్యారెక్టర్ ఇదే

on Mar 24, 2016

కమెడియన్ గా ఎంటరై హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. చాలా మంది హీరోల కంటే ఎక్కువగానే జనాన్ని థియేటర్లకు రప్పిస్తున్నాడు. హీరో అయిన తర్వాత, చాలామంది చాలా సార్లు అడిగినా, ఇక కమెడియన్ ట్రాక్ లోకి రానని ఖచ్చితంగా చెప్పేసిన సునీల్ కు మెగాస్టార్ కోసం మళ్లీ కమెడియన్ అవతారంలోకి రాక తప్పట్లేదు. చిరంజీవి అంటే సునీల్ కు ఎనలేని ఇష్టం. చిరుకు కూడా సునీల్ అంటే బాగా ఇష్టం. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్లన్నీ మంచి కామెడీ పండించాయి. అందుకే తన 150 వ సినిమాకు సునీల్ అయితేనే కరెక్ట్ అని భావించారు మెగాస్టార్. సునీల్ కూడా అడగ్గానే మరో మాట లేకుండా ఒప్పేసుకున్నాడు.

తమిళ కత్తిలో రెండో హీరో ఒక దొంగ. అతనితో పాటు ఒక ఫ్రెండ్ ఉంటాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో మంచి సీన్లుంటాయి. ఈ క్యారెక్టర్ ను కమెడియన్ అనే కంటే, హీరో ను ఎలివేట్ చేసే క్యారెక్టర్ అంటే కరెక్ట్. క్లైమాక్స్ లో, హీరోను అందరూ అపార్ధం చేసుకున్న సమయంలో, ఫ్రెండ్ వచ్చి వాళ్లందరికీ హీరో చేసిన మంచి పని గురించి చెబుతాడు. హీరో తర్వాత, కత్తికి అంత బరువైన పాత్ర అది. అందుకే సునీల్ కూడా ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు. పైపెచ్చు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి, సునీల్ క్యారెక్టర్ కు మరిన్ని కామెడీ సీన్స్ ను వినాయక్ జోడించబోతున్నాడట. దీంతో ఎంతో కాలంగా, సునీల్ మార్క్ కామెడీని మిస్ అయిన అతని ఫ్యాన్స్ అందరికీ, మరోసారి అది చూసే అవకాశం కలగబోతోంది. చిరు సరసన అనుష్క ను తీసుకోబోతున్నారని సమాచారం. మొదట నయనను తీసుకుందామనుకున్నా, మేడమ్ పారితోషకం చుక్కల్లో ఉండటంతో, అనుష్క వైపు మొగ్గు చూపారు. స్టాలిన్ లో స్పెషల్ సాంగ్ లో అనుష్క చిరుతో చిందేసిన సంగతి తెలిసిందే..


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.