చిరు.. బొమ్మ చూపిస్తున్నాడు
on Apr 18, 2016
.jpg)
చిరంజీవి 150వ సినిమాకి దర్శకత్వం వహించడానికి ఏ దర్శకుడూ ముందుకు రాలేదు. దానికి కారణం.. చిరు పెట్టే టార్చర్, ఈ సినిమాపై ఉండే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో వాళ్లకు తెలుసు కాబట్టి. సినిమా హిట్టయితే.. ఆ క్రెడిట్ ఓ రేంజులో వస్తుంది. అదే అంచనాలు తప్పి, సరిగా ఆడకపోతే.. అందరూ దర్శకుడ్ని నిందిస్తారు. ఆ నింద భరించడానికి ఏ దర్శకుడికి ఇష్టం ఉంటుంది చెప్పండి?? ఆఖరికి వినాయక్ కూడా అన్యమనస్కంగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తున్నాడు.
అఖిల్ తరవాత.. మరో సినిమా ఒప్పుకొంటే ఈ పాటికి సగం సినిమా పూర్తి చేసేవాడు వినాయక్. చిరంజీవి 150 వ సినిమాని నెత్తిమీద వేసుకోవడంతో అక్కడే ఇరుక్కుపోయాడు. కత్తి రీమేక్ ని తెలుగులో తీస్తున్నా.. ఆ స్ర్కిప్టు విషయంలో చిరంజీవికి చాలా అనుమానాలున్నాయి. పది మంది రైటర్లతో కత్తి స్ర్కిప్టుని తెలుగులో, చిరంజీవి ఇమేజ్ కి తగినట్టు మార్పులు చేశాడు వినాయక్. అయితే... అదీ చిరంజీవిని సంతృప్తి కలిగించలేదని టాక్. ఒక దశలో వినాయక్ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేద్దామని కూడా అనుకొన్నాడట. కానీ.. సన్నిహితులు వారించడంతో ఓపిగ్గా భరిస్తున్నాడట.
ఇప్పుడు కత్తిని పూర్తిగా పక్కన పెట్టేసి ఓ కొత్త కథతో చిరుని మెప్పించడమే ఈజీ అన్న నిర్ణయానికి వచ్చాడట వినాయక్. అందుకే ఓ రెండు కథలూ వినిపించాడట. కత్తికంటే అవే బాగున్నాయని చిరంజీవి భావించడంతో 150వ సినిమా విషయంలో కొత్త ట్విస్టు వచ్చినట్టైంది. కత్తిని పక్కన పెట్టి కొత్త కథలో తలమునకలయ్యాడట వినాయక్. మరి ఈ స్ర్కిప్టు అయినా చిరుకి నచ్చుతుందో లేదో?? చిరు ఇలానే నానుస్తూ పోతూ ఉంటే... ఆయన 150వ సినిమా వచ్చేనాటికి చరణ్ కూడా ఓ వంద సినిమాలు పూర్తి చేసేస్తాడు. ఇప్పటికైనా కాస్త స్పీడు పెంచు చిరు... లేదంటే నీ వీర ఫ్యాన్స్‌కీ నీరసాలు వచ్చేస్తాయ్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



