'జైలర్'కి నో చెప్పిన మెగాస్టార్.. అసలేం జరిగింది!?
on Sep 21, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా.. కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గానూ నమోదయ్యింది 'జైలర్' సినిమా. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించారు. థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రీసెంట్ గా ఓటీటీకి కూడా వచ్చింది. అక్కడా వీక్షకులను రంజింపజేస్తుంది.
ఇదిలా ఉంటే, 'జైలర్' కథ మొదట మెగాస్టార్ చిరంజీవికే వినిపించారట నెల్సన్. అయితే, ఆ కథలో పాటలకు, తన మార్క్ డాన్స్ లకు స్కోప్ లేకపోవడంతో ఆలోచనలో పడ్డారట చిరు. అంతేకాదు.. అదే సమయంలో విజయ్ తో నెల్సన్ 'బీస్ట్' మూవీ చేస్తున్నారు. సో.. 'బీస్ట్' రిజల్ట్ చూసి.. దాన్ని బట్టే 'జైలర్'పై నిర్ణయం తీసుకోవాలనుకున్నారట. అయితే, 'బీస్ట్' కాస్త డిజాస్టర్ కావడంతో.. 'జైలర్'కి నో చెప్పారట. అలా.. 'జైలర్' కథ రజినీకాంత్ చెంతకు చేరిందని సమాచారం. ఏదేమైనా.. చిరు ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read