ఆయనను కలవడం అదే చివరిసారి అవుతుందని ఊహించలేదు! చిరు భావోద్వేగం!!
on Nov 28, 2021
కొవిడ్ 19 బారినపడి చికిత్స పొందుతూ కొరియోగ్రరాఫర్ శివశంకర్ కన్నుమూయడంతో తెలుగుచిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. పలువురు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన లేని లోటు తీరనిదని నివాళులర్పిస్తున్నారు. ఇటీవలే ఆయన వైద్యం నిమిత్తం రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి కూడా శివశంకర్ మృతి వార్త విని చలించిపోయారు. భావోద్వేగానికి గురయ్యారు.
తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా శివశంకర్ మాస్టర్‌కు నివాళులర్పించిన ఆయన ఇటీవల ఆచార్య సెట్స్‌లో ఆయనను కలిశాననీ, అదే ఆయనతో చివరిసారి కలయిక అవుతుందని అస్సలు ఊహించలేదనీ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
"వందల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలు అందించిన శివశంకర్ మాస్టర్ కరోనా బారినపడి తుదిశ్వాస విడిచారు అనే వార్త మనసును కలచివేసింది. ఆయనతో నా అనుబంధం సుదీర్ఘమైంది. 'ఖైదీ' చిత్రానికి సలీమ్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించినా అసిస్టెంట్‌గా వెనకుండి డాన్సులు కంపోజ్ చేసింది శివశంకర్ మాస్టర్. ఆ రోజు మొదలయి 'మగధీర' వరకు అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు మరపురాని డాన్స్ మూవ్‌మెంట్స్ కంపోజ్ చేశారు. 'మగధీర'లోని "ధీర ధీర" పాటకి ఆయన నృత్యాలకి జాతీయ అవార్డు వచ్చింది. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్‌లో కలిశాను. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళారంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను." అని ట్వీట్ చేశారు చిరంజీవి.
Also read: శివశంకర్ మాస్టర్ ఇకలేరు.. బలితీసుకున్న కరోనా!

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
