జగన్ ఒక సోదరునిగా విందుకు ఆహ్వానించారు.. భారతి స్వయంగా వడ్డించారు!
on Jan 13, 2022

గురువారం మెగాస్టార్ చిరంజీవిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి. ఆయన ఆహ్వానంతో తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు చిరు. ఇద్దరూ కలిసి భోజనం చేశాక, ఇద్దరూ సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు అంశాల గురించి చర్చించుకున్నారు. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో తీసుకురావడం, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ పలు థియేటర్లను సీజ్ చేయడం, బెనిఫిట్ షోలు, ఎక్స్‌ట్రా షోలకు అనుమతి ఇవ్వకపోవడం వంటివి కొంతకాలంగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా టికెట్ ధరలను గణనీయంగా తగ్గించి వేయడంతో సినిమాలకొచ్చే వసూళ్లు కూడా ఆ మేరకు బాగా తగ్గిపోయాయి. పెద్ద సినిమాలకు ఇది గొడ్డలిపెట్టుగా తయారైంది.
Also read: జగన్-చిరు లంచ్ మీట్.. టికెట్ల లెక్క తేలుతుందా?
ఈ నేపథ్యంలో చిరంజీవి ఒక్కరినే విందుకు జగన్ ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది చిరును కూడా ఎగ్జయిట్‌మెంట్‌కు గురిచేసింది. "ఒక సోదరునిగా ఆయన నన్ను విందు భోజనానికి ఆహ్వానించి, ఆయన నాతో సంభాషించిన తీరు కానీ, ఆత్మీయతను కనపర్చిన విధానం కానీ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. దగ్గరుండి శ్రీమతి భారతిగారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంత ఆప్యాయత కనపర్చిన ఆ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు." అని ఎగ్జయిట్ అవుతూ చెప్పారు చిరు.
Also read: సినిమా ఇండస్ట్రీ కష్టాలను ఏపీలో వినిపించుకొనే నాథుడేడీ?
"ఇప్పుడు నేను ఒక్కడ్ని అనుకొని రాలేదు, నన్ను ఒక్కడ్ని రమ్మని ఆయన భోజనానికి ఆహ్వానిస్తే వచ్చాను. ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందనే నమ్మకం ఉంది" అని ఆయనన్నారు. 'ఈసారి ఎప్పుడొచ్చినా భోజనానికి కలుద్దామన్నా' అని జగన్ చెప్పారన్నారు. "అంత ఆప్యాయంగా సొంతమనిషిగా నన్ను చూస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు." అని చెప్పారు చిరు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



