Home

»

Latest News

ఒక్క‌టిగా క‌దిలిన మెగా ఫ్యామిలీ!

Apr 15, 2020 11:07AM

 

అంద‌రూ ఏక‌తాటిపై నిలిస్తే యుద్ధంలో గెలుపు ఖాయం. ఈ విష‌యాన్ని మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఒక్క‌టిగా చాటి చెపుతున్నారు. కోరానాపై పోరాటాన్ని స‌మ‌ష్టిగా ఎదుర్కొని గెలుద్దామ‌ని చెప్ప‌టానికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ క‌లిసి ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మొద‌లుకొని ఆయ‌న కుటుంబంలోని మొత్తం 13 మంది క‌లిసి వివిధ సో్గ‌న్స్ రాసివున్న ప్ల‌కార్డుల‌ను ప‌ట్టుకొని ప్ర‌జల‌ను చైత‌న్య‌వంతం చేస్తున్నారు.

"ఇంట్లో ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమ‌ను పంచుతాం.. కాలు క‌ద‌ప‌కుండా క‌రోనాని తరిమేస్తాం.. భార‌తీయులం ఒక్క‌టై భార‌త్‌ని గెలిపిస్తాం" అనే ఈ స్లోగ‌న్స్‌లోని ఒక్కో మాట‌ని ఒక్కొక్క‌రు ప్ర‌ద‌ర్శిస్తోన్న పిక్చ‌ర్‌ను చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా ఎకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ స్లోగ‌న్ ప్ర‌చారంలో పాలుపంచుకున్న‌వాళ్లు.. చిరంజీవి, అల్లు అర‌వింద్‌, నాగ‌బాబు, వ‌రుణ్‌తేజ్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌, సుస్మిత‌, అల్లు శిరీష్‌, నిహారిక‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, శ్రీ‌జ‌, క‌ల్యాణ్‌దేవ్‌.
 
"క‌లిసిక‌ట్టుగా మ‌నం ఈ యుద్ధంలో విజ‌యం సాధిస్తాం. మ‌నం ఉన్న‌చోటనే ఉందాం. మ‌న‌ల్ని క్షేమంగా ఉంచుకుంటూ, మ‌నకు ప్రియ‌మైన‌వాళ్ల‌ను, ఈ ప్ర‌పంచాన్ని సుర‌క్షితంగా ఉంచుదాం" అని ఈ పిక్చ‌ర్‌తో పాటు చిరంజీవి రాసుకొచ్చారు. భీక‌ర యుద్ధాన్ని గెల‌వ‌డానికి చిన్న అడుగులు చాల‌నీ, క‌రోనాకు వ్య‌తిరేకంగా ఏక‌మ‌వుదామ‌నీ ఆయ‌న పిలుపునిచ్చారు. చిరంజీవి, అల్లు అర‌వింద్ కుటుంబాల మ‌ధ్య ఇటీవ‌ల దూరం పెరుగుతోందంటూ వ‌స్తున్న ప్ర‌చారానికి ఈ క‌రోనా ప్ర‌చారంతో వారు చెక్ చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే ఈ ప్ర‌చారంలో అల్లు అర్జున్ మిస్స‌వ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com