మార్క్ శంకర్ మాఇంటికి వచ్చేసాడు..చిరంజీవి ప్రకటన
on Apr 10, 2025

పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిన్నకొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకొని గాయాలపాలైన విషయం తెలిసిందే.దీంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.
రీసెంట్ గా మార్క్ శంకర్(Mark Shankar)ఆరోగ్యం గురించి ఎక్స్ వేదికగా చిరంజీవి(Chiranjeevi)స్పందిస్తు మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి.మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి,ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి మా బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.నా తరపున,తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున,మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నామంటు ట్వీట్ చేసాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



