భయపడాల్సిన పని లేదు.. నేను విన్నాను, చెప్పాను
on Oct 31, 2025

-చిరంజీవి నుంచి వచ్చిన హామీ
-ఏక్తా దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిరు
-సజ్జనార్ తో చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావడానికి 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu)తో వడివడిగా ముస్తాబవుతున్నాడు. గత చిత్రం భోళాశంకర్ పరాజయం చెందటంతో పాటు రెండున్నర సంవత్సరాల తర్వాత వస్తుండటంతో, ఆ విషయాలన్నింటిని మరుగున పడేలా చెయ్యాలనే పట్టుదలతో చిరు తన కొత్త చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో కూడా అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.
చిరంజీవి రీసెంట్ గా తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన 'ఏక్తా దివస్'(ektha Divas)కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు సెలబ్రిటీస్ డీప్ ఫేక్ వంటి సైబర్ నేరం బారిన పడుతున్నారు. ఈ అంశాన్ని తెలంగాణ పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాను. డిజీపి సజ్జనార్ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన పని లేదు. వీటిపై త్వరలోనే ఒక చట్టం తీసుకొస్తున్నారు. వీటి నుంచి సామాన్యులకి కూడా రక్షణ కలగడంతో పాటు, ఆ విషయంలో భయపడాల్సిన పని కూడా లేదు. పోలీసులు చాలా ఫ్రెండ్లీ గానే ఉంటున్నారు. టెక్నాలజీ ని మంచికి ఉపయోగించుకోవాలని చిరంజీవి తెలపడం జరిగింది.
Also Read: ఓజి vs సంక్రాంతికి వస్తున్నాం.. ఎవరిది పై చేయి
ఇక చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడటం జరిగింది. సైబర్ కేటుగాళ్లు ఏఐ(AI)సాయంతో చిరంజీవి ఫోటోలని, వీడియోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.దీంతో చిరంజీవి తీవ్ర మనోవేదానికి గురై సజ్జనార్ కి ఫిర్యాదు చెయ్యడంతో పాటు కోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



