మ్యూజిక్ థెరఫీ ద్వారా పిల్లల్ని సులువుగా కన్నాను!
on Jun 25, 2022
ప్లే బ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఐన చిన్మయి శ్రీపాద అకౌంట్ ని ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే కొంత మంది అబ్బాయిలు తన పేజీకి న్యూడ్ ఫొటోస్ పోస్ట్ చేస్తుండటంతో ఆ సంస్థ ఈ చర్య తీసుకుంది. తన ఇన్‌స్టా అకౌంట్‌ను ఆ సంస్థ డిలిట్ చేసిన విషయాన్ని చిన్మయి స్వయంగా తెలిపింది. తన బ్యాకప్ హ్యాండిల్ ద్వారా ఆమె ఈ విషయాన్ని షేర్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా తన కొత్త ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో షేర్ చేసుకుంది. అందులో ఆమె తన గైనకాలజిస్ట్‌తో కలిసి తన డెలివరీ సమయంలో మ్యూజిక్ థెరపీ ఎలా సహాయ పడింది అనే విషయం గురించి మాట్లాడింది. చిన్మయి తన ప్రసవ సమయంలో తాను భజనలు పాడినట్లు వెల్లడించింది.
"30 ఏళ్ళు వచ్చేశాయని ఎవరూ బాధపడొద్దు. 30 తర్వాత కూడా ఎంచక్కా పిల్లల్ని కనొచ్చు" అని చిన్మయి గైనకాలజిస్ట్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇక చిన్మయికి ఇటీవల కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఆ రెండో రోజే తన ఇన్స్టాగ్రామ్ పేజీ డిలీట్ అయ్యింది. ఈ విషయమై ఇక సోషల్ మీడియాలో చిన్మయికి నెటిజన్ల నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. చిన్మయి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సొసైటీలో స్త్రీలకు ఎదురయ్యే ఎన్నో సమస్యల మీద కూడా ఆమె గట్టిగా పోరాడుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో జరిగే ఎన్నో అరాచకాలను, చీకట్లో జరిగే వ్యవహారాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చి ప్రశ్నించింది కూడా. ఆమె చివరిసారిగా కార్తీక్, రామజోగయ్యశాస్త్రితో కలిసి 'సరిగమప 2018' తెలుగు ఎడిషన్‌కు జడ్జిగా వ్యవహరించింది.
Also Read