కేసీఆర్ ఎవరు..?
on Jun 2, 2017
.jpg)
ఇటీవలి కాలంలో బయోపిక్స్‌కు జనంలో ఆదరణ బాగా పెరుగుతోంది. తమకు బాగా ఇష్టమైన క్రికెటరో, హీరోనో, హీరోల పర్సనల్ లైఫ్ గురించి తెలియని విషయాల్ని చూపిస్తుంటే ఫ్యాన్స్ బాగా రీసీవ్ చేసుకుంటున్నారు. ఎంఎస్ ధోనీ, మేరీకోమ్, సచిన్ మూవీలకు కలెక్షన్లతో పాటు విమర్శకులు ప్రశంసలు కూడా లభించడంతో దర్శకనిర్మాతలు బయోపిక్స్‌పై ఫోకస్ పెట్టారు.
తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితాన్ని కూడా వెండితెర మీదకు తీసుకురావాలని సంకల్పించింది టాలీవుడ్. పెళ్లిచూపులు మూవీతో మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కందుకూరి..కేసీఆర్ జీవితం ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు..దీనికి మధుర శ్రీధర్ దర్శకత్వం వహించనున్నారు. స్క్రిప్ట్ అంతా రెడీగానే ఉన్నప్పటికీ కేసీఆర్ పాత్రధారి ఎవరా అని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పోలికలకు దగ్గరగా ఉండే బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును సంప్రదించారట నిర్మాతలు. అలాగే తమిళ సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని కూడా పరిశీలనలో ఉన్నారట. వీళ్లద్దరిలో ఒకర్ని కేసీఆర్ పాత్ర కోసం తీసుకోవాలనుకుంటున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి 2019 ఎన్నికల నాటికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



