ఛావా లో దైవత్వం ఉంది..మూవీ చూస్తే ఏడ్చేస్తానంటున్న రష్మిక
on Jan 31, 2025
'ఛత్రపతి శివాజీ మహారాజ్'(Chhatrapati Shivaji Maharaj)తనయుడు 'శంభాజీ మహారాజ్'(Sambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'చావా'(Chhaava)శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్(Vicky Kaushal)ఆయన భార్య యేసుబాయి క్యారక్టర్ లో రష్మిక మందన్నా(Rashmika mandanna)ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 14న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది.దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించగా,లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు.రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి.అందులో భాగంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌కు చేరుకుంది.
ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో విక్కీ కౌశల్ మాట్లాడుతు'చావా' కోసం శారీరకంగా,మానసికంగా ఎంతో ప్రిపేర్ అయ్యాను.యుద్దాలు,గుర్రపు స్వారీల్లో కూడా శిక్షణ తీసుకున్నాను.వీటన్నిటి కంటే కూడా 'ఛత్రపతి శంభాజీ మహారాజ్' అనే క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేయడం, నా మనసుని ఆ పాత్ర కోసం సన్నద్దం చేసుకోవడం సవాలుగా అనిపించింది.ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీరాముని వంటి వారు అయితే 'శంభాజీ మహారాజ్' సింహం వంటి యోధులు.వారి గురించి ఇంత కంటే గొప్పగా నేను వర్ణించలేను.దర్శకుడు లక్ష్మణ్ గారు మొదటి నుంచి కూడా నన్ను క్యారక్టర్ పేరుతోనే పిలుస్తుండే వాళ్ళు.నేను ఈ క్యారక్టర్ ని పోషించగలను అనే నమ్మకాన్ని లక్ష్మణ్ గారు నాలో ముందు నుంచీ కలిగిస్తూనే వచ్చారు.నిజమైన యోధుల కథను చెబుతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది.ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన దినేష్ విజన్ గారికి, తెరకెక్కించిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. రెహమాన్ గారి సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది.శంభాజీ మహారాజ్ క్యారక్టర్ దొరకడం నా అదృష్టం.జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది.మూవీ కూడా చాలా గొప్పగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.
రష్మిక మందన్న మాట్లాడుతు 'ఛావా’చిత్రంలో మాటలకు అందని భావం ఉంటుంది. ఇందులో ఓ దైవత్వం ఉంటుంది.అంతులేని ప్రేమ ఉంటుంది.అందుకే ఈ చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యా.ఈ మూవీచూసిన ప్రతీసారి నేను ఏడ్చేస్తాను. అంత అద్భుతంగా ఉంటుంది. ఏ ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, జానే తూ అనే పాట అందరినీ మెస్మరైజ్ చేస్తుంటుంది. విక్కీ చుట్టూ అద్భుతమైన ఆరా ఉంటుంది. ఆయన పక్కన నిలబడితేనే ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఛావా పాత్రకు విక్కీ అద్భుతంగా సెట్ అయ్యారు. అందుకే లక్ష్మణ్ సర్ విక్కీని ఈ క్యారక్టర్ కి తీసుకున్నారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
