ఛార్మి డైమండ్ రింగ్ పోయిందట..!
on May 3, 2016
అవకాశాలు లేకపోయినా, సొంత నిర్మాణ సంస్థ స్థాపించి ఎలాగో మళ్లీ హిట్ కొట్టాలని ట్రై చేస్తోంది ఛార్మి. జ్యోతిలక్ష్మి తర్వాత ఛార్మి మళ్లీ జనాలకు పెద్దగా కనిపించలేదు. మనసులో ఏం ఉన్నా ఓపెన్ గా ఎక్స్ ప్రెస్ చేసే ఈ భామ వ్యక్తిత్వం అభిమానులతో పాటు శత్రువుల్ని కూడా తెచ్చిపెట్టింది. అందుకే ఛార్మిని ట్విట్టర్లో ఇబ్బంది పెట్టే వాళ్లు కూడా ఎక్కుగానే ఉంటారు. ఇప్పుడు వాళ్లందరికీ ఒక షాకింగ్ పంచ్ వేసింది ఛార్మి. తనను ద్వేషించే వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్ చెబుతానంటూ, తన షాపింగ్ బ్యాగ్ తో పాటు, డైమండ్ రింగ్ ను కూడా కోల్పోయానని చెబుతూ, ప్రతీరోజూ మంచి రోజు కాదు కదా అంటూ నిట్టూర్చింది.
వాటిని ఎవరైనా దొంగిలించారా, లేక తనే ఎక్కడైనా వదిలేసిందా అన్న విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. కాగా, ఛార్మి అకౌంట్ ఇప్పుడు సినిమాలేవీ లేవు. అందుకే పూర్తి స్థాయి నిర్మాతగా సెటిల్ అయిపోయే ఆలోచనలో ఉంది. పూరీ జగన్నాథ్ తో కలిసి, చిన్న సినిమాల్ని నిర్మించాలనే ఆలోచన లో ఉందట ఈ హీరోయిన్. మధ్యమధ్యలో ఐటెం సాంగ్స్ కూడా చేస్తానంటోంది. నిర్మాతగా జ్యోతిలక్ష్మి ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని మరో సినిమా నిర్మించడానికి సిద్ధపడుతుందంటే, ఛార్మిని మెచ్చుకోవాల్సిందే.